వైయస్సార్ పార్టీ హయాంలో ప్రజలపై విద్యుత్ భారం పడిందని అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. వైసిపి హయాంలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల పై భారం మోపారని రవికుమార్ విమర్శించారు. టిడిపి అధికారంలోకి రాగానే విద్యుత్ సంస్కరణలు మార్చి ప్రజలకు మెరుగైన విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు.