అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో మంగళవారం గ్రామంలోని సచివాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 140 మంది ప్రజలకు కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ కూడా చేస్తామని డాక్టర్ నరసింహారావు తేలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు.