కొత్తపాలెం గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తాను

65చూసినవారు
కొత్తపాలెం గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తాను
కొత్తపాలెం గ్రామ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషి చేస్తానని అన్నారు. గ్రామ సర్పంచ్ పాలపర్తి బూసిరెడ్డి, కొమరగిరి చెంచయ్యతో పాటు పలువురు గ్రామస్తులు ఆయనను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో సమస్యలను దశలవారిగా పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే, ఎస్సీ ఎస్టీ కాలనీలో రోడ్ల నిర్మాణం, అంతర్గత సిసి రోడ్లు, విద్యుత్ పునరుద్ధరణ తదితర అభివృద్ధి చర్యలు తీసుకుంటానని చెప్పారు.

సంబంధిత పోస్ట్