కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు సోమవారం వేకువజాము నుంచే ప్రారంభమయ్యాయి. స్థానిక ఎస్సీ కాలనీ నందు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కవల వీరయ్య, పేరం వేణు, బిల్లా అంజయ్య, కోటయ్య, శీను, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.