మెదరమెట్ల జాతీయ రహదారిపై అక్రమ రేషన్ బియ్యం తరలి వెళుతున్నాయని సమాచారంతో ఎస్సై మహమ్మద్ రఫీ మంగళవారం తన సిబ్బందితో కలిసి కంటైనర్ లారీ ను తనిఖీ చేశారు. అందులో 325 రైస్ బ్యాగ్ లను గుర్తించి లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్ దేవరకొండ గోపి ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.