కొరిసపాడు: శిక్షణా కేంద్రాన్ని పర్యవేక్షించిన ఎండిఓ

81చూసినవారు
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు బుధవారం ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎండిఓ రాజ్యలక్ష్మి పర్యవేక్షించారు. ప్రభుత్వం అందించిన సహకారాన్ని మహిళలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మన్నె రామారావు, ఎంపీపీ ప్రసన్నకుమారి, జడ్పిటిసి వెంకటరమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్