కొరిశపాడు మండలం మేదరమెట్ల లోని ఆర్టీసీ బస్టాండ్ ను గురువారం గుంటూరు డిప్యూటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రవికాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ వద్ద ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి ఆయన డిపో మేనేజర్ రామ్మోహన్ రావు ను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ లో ఉన్న టాయిలెట్లు, ఫ్యాన్లు, బెంచీలను పరిశీలించారు. ఉద్యోగస్తుల డ్యూటీ రిజిస్టర్ ను తనిఖీ చేశారు.