కొరిశపాడు మండలం మెదరమెట్ల గ్రామంలో అనంతపురం జిల్లాకు చెందిన పలువురు రైతులు మెదరమెట్లలోని ఓ గూడెం నందు ఒంగోలుకు చెందిన హరిబాబు పొగాకు కొంటానని నమ్మించాడంటూ మంగళవారం పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. లారీలలో అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చాక తీరా అతను కొనడం లేదని వారు వాపోయారు. సుమారు వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నామని అతని దగ్గర నుండి సమాధానం లేదని అన్నారు.