అద్దంకి: కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

548చూసినవారు
కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేదరమెట్ల నుండి ఒంగోలు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని క్షతగాత్రుడ ను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు చీరాలకు చెందిన వెంకట్రావుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్