కొరిశపాడు మండలం మేదరమెట్లలోని మిద్దెలడొంక నందు బుధవారం నూతన విద్యుత్ స్తంభాల నిర్మాణ పనులను ప్రారంభించారు. విద్యుత్ లైన్ పనులను లైన్ మెన్ రాజశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేందుకు నూతన స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో ప్రజలకు విద్యుత్ సమస్య లేకుండా చూస్తున్నట్లు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.