కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణ మారింది. పగలంతా ఎండకాచి ఒకసారిగా నల్లటి మేఘాలతో మబ్బులు అలు ముకున్నాయి. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో మేఘావృతమైంది. దీంతో పగలంతా ఎండ దాటికి ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే కల్లాలలో మిరపకాయలు, పొగాకు ఉండటంతో రైతులు కొంత ఇబ్బంది పడ్డారు.