కొరిశపాడు ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొరిశపాడుకు చెందిన వృద్ధుడు నారాయణ రోడ్డు దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడు పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.