కొరిశపాడు: సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభ

82చూసినవారు
కొరిశపాడు: సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభ
కొరిశపాడు మండలం రాచపూడి గ్రామంలో శనివారం రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రి సర్వే డిటి రవికాంత్ పాల్గొని భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. గ్రామసభలో వచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని రవికాంత్ తెలియజేశారు. రిసర్వే లో సమస్యలను గ్రామసభలో పరిష్కరించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్