కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో శనివారం యోగాంధ్రపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. యోగ వలన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆమె చెప్పారు. మనిషి జీవితంలో మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యమని రాజ్యలక్ష్మి తెలియజేశారు.