కొరిశపాడు గ్రామంలోని అంగన్వాడి కార్యాలయం నందు బుధవారం బాల్యవివాహాలు నివారణపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి పాల్గొని అంగన్వాడి కార్యకర్తలతో బాల్యవివాహాలను అరికడదాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి అంగన్వాడి సెంటర్లలో తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.