కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన పాలపర్తి శ్రీధర్ ( చిట్టిబాబు) ను వైసిపి మండల పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి శుక్రవారం ఉత్తర్వులు వెలుపడ్డాయి. వరుసగా రెండోసారి మండల పార్టీ అధ్యక్షుడు పదవి పమిడిపాడుకు రావటం విశేషం. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి, భద్రారెడ్డి, హనీమిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చిట్టిబాబు తెలియజేశారు.