కొరిశపాడు: తీరనున్న ప్రయాణికుల కష్టాలు

84చూసినవారు
కొరిశపాడు: తీరనున్న ప్రయాణికుల కష్టాలు
కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. గత సంవత్సరాల నుంచి బస్టాండ్ లేక మేజర్ పంచాయతీ పరిధిలోని ఆయా గ్రామాల్లోని ప్రయాణికులు ఎండకు, వానకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే శనివారం మండల పార్టీ అధ్యక్షులు జాగర్లమూడి జయకృష్ణ బస్టాండ్ పనులను ప్రారంభించారు. మంత్రి రవికుమార్, రావి నరేష్ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నారని జయకృష్ణ చెప్పారు.

సంబంధిత పోస్ట్