కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం గ్రామంలో మంగళవారం పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో సురేష్ బాబు పరిశీలించారు. పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరును ఆయన సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నేరుగా పెన్షన్ నగదును అందజేయాలని ఎంపీడీవో సూచించారు. సాయంత్రం కల్లా 99 శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలని ఆయన ఆదేశించారు.