రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ నల్లమడ రైతులు పర్చూరు తహశీల్దార్ కార్యాలయంలో వద్ద ధర్నా నిర్వహించారు. నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో రైతులు పాల్గొని పంట ఉత్పత్తుల కు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొగాకు, మిర్చి, శనగ రైతులు గిట్టుబాటు ధర లేక అప్పులపాలయ్యే ప్రమాదం ఉందన్నారు.