పంగులూరు మండలం ముప్పవరం ఫ్లై ఓవర్ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుండి ఒరిస్సా వెళుతున్న కెమికల్ పౌడర్ లారీ పులివెందుల నుండి విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ను ఢీ కొట్టింది. స్థానికుల సమాచారంతో హైవే మొబైల్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి ట్రావెల్స్ బస్సులో ఉన్న ప్రయాణికులను శ్రమించి బయటకు తీశారు. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.