మండల కేంద్రమైన పంగులూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర గోడౌన్లను సర్వ శిక్ష అభియాన్ సీఎంవో శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఐదు గోడౌన్లలో విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు భద్రపరచడం పట్ల ఆయన సంతృప్తి చెందారు. పాఠశాలలు తెరిచిన తర్వాత సకాలంలో విద్యార్థులకు అన్ని రకాల వస్తువులను అందించాలని ఆయన కోరారు.