పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలో గురువారం నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు, సైడ్ కాలువల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రోడ్లు మెరుగులు దిద్దుకున్నాయని అన్నారు. వైసిపి హయాంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు.