అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో బుధవారం ఎంపీడీవో దేవసేన కుమారి, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మనోజ్ లు పర్యటించారు. గ్రామంలో విష జ్వరాల బారిన పడిన పలువురికి డాక్టర్ మనోజ్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. జ్వరాలు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పై ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో టిడిపి నేత కరిముల్లా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.