సంతమాగులూరు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎంపిక ను శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కంచర్ల సుబ్బారావు, కార్యదర్శిగా కాలేశావళి, ట్రెజరీగా సుబ్బారావు, సహాయ కార్యదర్శిగా నాగూర్ వలి, కార్యవర్గ సభ్యులుగా బాలాంజనేయులు, శేషులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు రిపోర్టర్లు అభినందించారు.