సంతమాగులూరులోని BPL/98 మద్యం షాపు లైసెన్స్‌ను రద్దు చేసినట్లు బాపట్ల జిల్లా ఎక్సైజ్ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. షాపుదారులు లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. ఈ షాపును మళ్లీ వేలం వేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. మద్యం షాపుదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు.