అద్దంకి మండలం కలవకూరు గ్రామంలో శుక్రవారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటకృష్ణ పాల్గొని వరిలో సంరక్షణ చర్యలను గుర్తించి ఆయన రైతులకు వివరించారు. పొలంలో వరి సాగు చేసే ముందు 25 నుండి 30 రోజుల నారును నాటుకోవాలని అన్నారు. వరి నాటేటప్పుడు నారు కోసలు తుంచి నాటాలని దీని ద్వారా కాండం తోలుచు పురుగును నివారించవచ్చని ఏవో వెంకటకృష్ణ తెలియజేశారు.