అద్దంకి రూరల్ సిఐ గా పనిచేసిన శివరామకృష్ణారెడ్డి బదిలీ అయిన నేపద్యంలో ఆయన స్థానంలో బుధవారం మల్లికార్జున రావు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈయన బాపట్ల నుండి అద్దంకి రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని అన్నారు.