అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు స్థలాలను గురువారం విద్యుత్ శాఖ ఎడియం దామోదరం, స్థానిక టిడిపి నాయకులు కరీముల్లా తో కలిసి పరిశీలించారు. విద్యుత్ ఆధునీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని, ట్రాన్స్ఫార్మర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన విద్యుత్ సిబ్బందికి ఆదేశించారు. ఏమైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.