కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వారిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.