కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ 75వ జన్మదిన వేడుకలు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నేతలు వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ వైయస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. గ్రామ సర్పంచ్ బొనిగల యలిశమ్మ, మాజీ సర్పంచ్ పేరం నాగలక్ష్మి ఇద్దరు కలసి జన్మదిన కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యర్రం రత్నారెడ్డి, జజ్జర ఆనందరావు, దామవరపు ప్రసాద్, కరుణాకర్, ఈశ్వర్, మన్నం ప్రసాద్, బ్రహ్మారెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.