బాపట్ల జిల్లాకు 2 వేల 717 జీవిత భాగస్వామి పింఛన్లు

68చూసినవారు
బాపట్ల జిల్లాకు 2 వేల 717 జీవిత భాగస్వామి పింఛన్లు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా జిల్లాకు 2 వేల 717 జీవిత భాగస్వామి పెన్షన్లు మంజూరైనాయని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా జీవిత భాగస్వామి పెన్షన్ కింద ఒక్కొక్కరికి 4 వేల రూపాయలు చొప్పున ఈనెల 12వ తేదీన అందజేస్తామని తెలిపారు. జిల్లాకు మంజూరైన జీవిత భాగస్వామి పెన్షన్లకు ఒక కోటి 8 లక్షల 68 వేల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్