విజయవాడ వరద విపత్తులో పాల్గొని మెరుగైన సేవలను అందించిన బాపట్ల మున్సిపల్ కార్మికులకు అభినందనలు అని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కొనియాడారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం ముగింపు సభలో ఆయన 90 మంది మున్సిపల్ కార్మికులకు ఒక్కొక్కరికి 5 వేలు చొప్పున బహుమానం ప్రకటించారు. జిల్లా కలెక్టర్ వెంకట మురళి, కమిషనర్ నిర్మల్ కుమార్ , సిబ్బంది పాల్గొన్నారు.