అభ్యంతరాల స్వీకరణ పక్కాగా ఉండాలి: సీఈఓ వివేక్ యాదవ్

71చూసినవారు
అభ్యంతరాల స్వీకరణ పక్కాగా ఉండాలి: సీఈఓ వివేక్ యాదవ్
సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీకి అభ్యంతరాల స్వీకరణ పరిశీలన పక్కాగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర రాజధాని నుంచి మంగళవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ జిల్లాలో 99. 09% పూర్తయిందని కలెక్టర్ వెంకట మురళి కమిషన్ కు తెలిపారు.

సంబంధిత పోస్ట్