బాపట్ల పట్టణంలోని 2, 3, 4, 6 సచివాలయాలను గురువారం మున్సిపల్ కమిషనర్ రఘునాధ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయాలు హాజరు రిజిస్టర్, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. సిబ్బంది విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా కార్యాలయానికి పంపాలని తెలిపారు. సమయపాలన పాటించాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.