అమరావతి: పాలవాగు కాలువ పనులు వేగవంతం

68చూసినవారు
అమరావతి: పాలవాగు కాలువ పనులు వేగవంతం
రాజధాని ప్రాంతంలో కీలకమైన పాలవాగు కాలువ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వెలగపూడి వద్ద ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కాలువ E4, N10, N9 రహదారుల మధ్య నుంచి వెళ్లనుంది. ఇది క్రికెట్ అకాడమీ ప్రాంతం నుంచి మొదలై సచివాలయం, అసెంబ్లీ మీదుగా కృష్ణాయ పాలెం రిజర్వాయర్ వరకు వెళుతుంది. కాలువ వెడల్పు మారుతూ ఉంటుంది. 8 - 9 మీటర్ల లోతులో తవ్వుతున్నారు. కాలువ చుట్టూ పచ్చదనం ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్