అమర్తలూరు మండలంలోని రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.24.49 లక్షల విలువైన పరికరాలను రాయితీపై వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బుధవారం అందించారు. మొత్తం 49 అప్లికేషన్లకు సంబంధించిన పరికరాలకు రూ.9.74 లక్షల రాయితీ మంజూరైంది. ఎస్సీ కేటగిరీలో 6 మందికి రూ.1.24 లక్షల రాయితీతో పరికరాలు అందించారు.