బాపట్ల పట్టణంలోని సిబిజెడ్ చర్చి ఆధ్వర్యంలో మట్టల ఆదివారం పండుగ సందర్భంగా క్రైస్తవులు పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. రెవ. ఎం పవిత్ర కుమార్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు సర్వమానవాళి పాపము నిమిత్తమై బలి అర్పణకు ముందు ఎరుషలేం పట్టణంలో జయ ప్రవేశం చేసిన రోజును మట్టల ఆదివారంగా జరుపుకుంటారని తెలిపారు. సంఘస్తులు, స్త్రీల సమాజం, సండే స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.