బాపట్ల పట్టణంలో లారీ ఢీకొని వ్యక్తి మరణించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మూర్తి నగరం ప్రధాన రహదారి గుంటూరు రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి లారీ అతివేగంగా వచ్చి ఢీ కొన్నట్లు తెలిపారు. వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.