బాపట్ల మండలం స్టువర్టుపురం గ్రామంలో గురువారం నాటు సారా తయారీ కేంద్రంపై చీరాల ఎక్సైజ్ సీఐ పి. నాగేశ్వరరావు, బాపట్ల ఎక్సైజ్ సీఐ పి. గీతిక సిబ్బందితో ఉమ్మడి దాడులు చేశారు. 10 లీటర్ల నాటు సారా, నాటు సారా తయారీ కోసం దాచి ఉంచిన 700లీ. బెల్లం ఊటను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసి ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బాపట్ల ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ గీతిక మీడియాకు తెలిపారు.