ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన్ పధకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో విద్యుత్, డి. ఆర్. డి. ఎ, సోలార్ కంపెనీ డీలర్లుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన్ పధకం క్రింద ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులకు వెంటనే బ్యాంక్ రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు.