బాపట్ల మండలం ఆసోదివారి పాలెం గ్రామంలో బుధవారం బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ సీసీ రోడ్డు ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశ్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు కావూరి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ సలీమా, ఎంపీడీఓ బాబురావు, ఈఓపీ ఆర్. డి. శ్రీనివాసరావు, ఏఈ మోహన్ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.