మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల కాపు కళ్యాణమండపంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొని ఆర్ధికంగా బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కూటమి శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.