గృహ నిర్మాణాలలో లక్ష్యాల మేరకు అధికారులు పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. గృహ నిర్మాణాలపై ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పేదలకు మంజూరు చేస్తున్న పక్కా గృహాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.