స్వచ్చాంధ్ర కార్యక్రమంతో పర్యావరణాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో గురువారం కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ఉద్గారాలను పూర్తిగా నిషేధించాలని చెప్పారు. భూమిలో కుళ్లిపోయే పదార్థాలను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ చెప్పారు.