బాపట్ల జిల్లా స్థాయి బ్యాంకర్స్ సమావేశం శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు ఈ ఏడాది రుణాలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్లు పూర్తి చేయడమే కాకుండా అదనంగా రైతులకు రుణాలు ఇచ్చి ఆర్థిక పరిపుష్టికి చేయూత ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఆయా బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.