బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను గురువారం జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ పి. శ్రీనివాసరావు తనిఖీ చేశారు. పాఠశాలలకు వసతి గృహాలకు అందిస్తున్న బియ్యం తదితర సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు.