నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా శనివారం బాపట్ల ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బేతపూడి గ్రామంలో శనివారం నాటు సారాయి సేవించడం వలన కలిగే అనర్థాలపై గ్రామ ప్రజలతో అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఒంగోలు కే. విజయ, అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎన్ఫోర్స్మెంట్, ఒంగోలు ఏ. జనార్దన రావు, సిబ్బంది పాల్గొన్నారు.