బాపట్ల జిల్లా పిట్ల వానిపాలెం మండలం చందోలు గ్రామoలో శనివారం పంచాయతీ సరఫరా చేసే త్రాగునీరు రంగు మారి దుర్వాసన వెదజల్లుతుoది. నీరు కలుషితంగా మారి తాగడానికి పనికిరాని విధంగా మడ్డి మడ్డిగా సరఫరా అయింది. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నీరు తాగితే రోగాలు పాలు అవుతామని గ్రామస్తులు తెలిపారు. పంచాయతీ అధికారుల సమస్యను పరిష్కరించాలని కోరారు.