బాపట్ల: కౌలు కార్డులపై రైతులకు అవగాహన

64చూసినవారు
బాపట్ల: కౌలు కార్డులపై రైతులకు అవగాహన
బుద్ధాం, యాజలి, దుండివారిపాలెం, దమ్మనవారిపాలెం గ్రామాల్లో బుధవారం కౌలు గుర్తింపు కార్డులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ మాట్లాడుతూ. కౌలుదారులకు రెవెన్యూ అధికారుల ద్వారా కౌలు కార్డులు అందజేస్తున్నట్టు తెలిపారు. కౌలు కార్డులుంటేనే పంటల నమోదు, భీమా, నష్టపరిహారం, రుణాలు, మద్దతు ధరలు లభిస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్