బాపట్ల: అగ్ని ప్రమాద బాధితుడికి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు అందజేత

61చూసినవారు
బాపట్ల: అగ్ని ప్రమాద బాధితుడికి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు అందజేత
కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సాంబయ్య అనే వ్యక్తి గృహం పూర్తిగా దగ్ధమైంది.ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామానికి వచ్చిన ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు బాధితుడిని పరామర్శించి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్